వర్మ 'రక్త చరిత్ర' లో హైలెట్ అయ్యేది ఎవరంటేం...
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించుతున్న రక్త చరిత్ర చిత్రంలో మద్దెల చెరువు సూరి పాత్రనే హైలెట్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే పరిటాల రవి అభిమానులను నిరాశపరుస్తుందని ఆయను కొద్ది మంది చెప్పి చూసారని అయినా వినిపించుకోకుండా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక వర్మ..ఎక్కువగా సూరి పాత్రకే బాగా ప్రేరణ పొందాడని అందుకే అలా స్క్రిప్టు రాసుకుని చేస్తున్నాడని అంటున్నారు. అందులోనూ సూర్యని ఆ పాత్రకు ఎన్నుకోవటం, సూర్య భార్యగా ప్రియమణితో చేయటం ఇవన్నీ ఆ పాత్రమీద ఉన్న మమకారానికి కారణాలు అంటున్నారు. అయితే జరిగిన చరిత్రను వక్రీకరిస్తే మాత్రం చాలా తలనొప్పులు ఎదుర్కోవల్సి వస్తుందని ఇది కత్తి మీద సాము లాంటిదేనని అంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర మద్దెల చెరువు సూరి సూర్య ప్రియమణి rakta charitra ram gopal varma suri priyamani


Click it and Unblock the Notifications