twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో సీనియర్ హీరో.. విలన్ పాత్ర కోసమేనా?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరి కంటే వేగంగా సినిమాలు చేస్తున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ నేటి తరం యువ హీరోల కంటే దూకుడుగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 4 సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఒక సినిమా తర్వాత మరొక సినిమాను వెంట వెంటనే పూర్తి చేయాలని మెగాస్టార్ ఒక స్పెషల్ టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇక ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన స్పెషల్ అప్ డేట్స్ కూడా ఇస్తున్నారు.

    సినిమాల విడుదల తేదీలో ఆలస్యం అయినప్పటికీ కూడా మెగాస్టార్ అప్డేట్స్ ఇవ్వడంలో మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు. ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ కూడా ఆచార్య సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టపడి చేస్తున్న లూసిఫర్ రీమేక్ పై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. అయితే ఈ కథను ఎలాగైనా సరికొత్తగా తెరకెక్కించాలని గత రెండేళ్లుగా మెగాస్టార్ ప్రయత్నాలు చేశారు.

    Madhavan powerful villain role in Megastar chiranjeevi god father

    వివి వినాయక్, సుజిత్ వంటి దర్శకులను కూడా రంగంలోకి దింపారు. అయితే మెగాస్టార్ కు తగ్గట్టుగా స్క్రిప్టు రెడీ చేయలేకపోవడంతో వారిని ఫిక్స్ చేయలేకపోయారు. ఫైనల్ గా తమిళ దర్శకుడు మోహన్ రాజా మెగాస్టార్ కు తగ్గట్లుగా కథను రెడీ చేసి ఇచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ తో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇక సినిమాలో తప్పకుండా ప్రతి ఒక్క పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉంటుందని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మలయాళం లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించగా బిజు మీనన్ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

    ఇక తెలుగులో మెగాస్టార్ కు ప్రతినాయకుడిగా కనిపించబోయేది ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది ఆ విషయంలో దర్శకుడు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ సలహా మేరకు మాధవన్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని ఆలోచిస్తున్నారట. అయితే గత కొంతకాలంగా మాధవన్ మాత్రం తెలుగు సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నాడు. పాత్ర నచ్చితే గాని ఒప్పుకోవడం లేదు. గతంలో పెద్ద సినిమాలను చాలా వరకు రిజెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో తో విలన్ పాత్ర అంటే ఎంతవరకు ఒప్పుకుంటాడో చూడాలి.

    లూసిఫర్ రీమేక్ కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరికొంత మంది ప్రముఖ నటీనటులు కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఎడాది సమ్మర్ అనంతరం రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

    English summary
    Madhavan powerful villain role in Megastar chiranjeevi god father
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X