ఆయన 'కృష్ణ వంశి' ...

By Staff

Krishna Vamsi
తెలుగు దర్శకులలో కృష్ణవంశి అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే నటులలో చాలామందైతే తాము ఒక్కసారైనా ఆయన సినిమాలో నటించాలని, దర్శకత్వం కోసం వచ్చే వారైతే తాము ఆయన దగ్గర చేరాలని ట్రై చేస్తూంటారు. ఇక ఆయన ఈ మధ్య బయిట దర్శకులకు పాటలు తీసి మరో సంచలనం సృష్టించారు. అంటే ఆయన విజువల్స్ సెన్సివల్ గా ఉండి ఆకట్టకుంటాయనేగా. దాంతో ఒక అప్ కమింగ్ దర్శకుడు తను కృష్ణవంశి లా పాటలు తీస్తానని చెప్పుకుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నిజానికి ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. మరి ఆ శైలి ఎలా ఉంటుంది.. ఎవరిని పోలి ఉంటుంది అంటే చెప్పటం కష్టమే. కానీ కొందరు దాన్ని విశదీకరంచి చెప్పగలుగుతారు. అలా మధురా శ్రీధర్ తను చిత్రికరించబోయే పాటలని కృష్ణవంశి లా చిత్రీకరిస్తారని చెప్పుతున్నారు. మధురా ఎంటరటైనమెంట్ వారు చిత్ర నిర్మాణంలోకి దూకి స్నేహగీతం అనే చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి మధురా ఆడియో యజమాని శ్రీధరే దర్శకత్వం వహించబోతున్నారు. అంతే గాక ఆయన రెండు పాటలకి కొరియోగ్రాఫర్ గా వహిస్తారట. అలాగే పాటల్ని క్రియోటివ్ డైరక్టవ్ గా చెప్పబడే కృష్ణవంశి స్టైల్ లో చిత్రీకరిస్తారని చెప్పుకుంటున్నారు.

అలాగే శ్రీధర్ లో మరో హిడెన్ టాలెంట్ పాటలు పాడటం,రాయటమూట. అంటే టోటల్ గా ఆయనే పాట రాసుకుని,పాడుకుని,కొరియోగ్రఫి చేస్తారన్నమాట. దాని కోసం ఆయన సింగర్స్ కి ,డాన్సర్స్ కి టాలెంట్ హంట్ నిర్వహిస్తారుట. యేదైమైనా స్నేహ గీతం... కాబోయే కృష్ణవంశీ గీతం అన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X