ఎన్టీఆర్ అయినా ఆమెకు బ్రేక్ ఇస్తాడా?

By Srikanya

హైదరాబాద్ : అజయ్ తో ఆ ఒక్కడే చిత్రం చేసిన మధురిమ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఆమె సరదాగా కాసేపు అంటూ వంశీ దర్శకత్వంలో చిత్రం చేసినా బ్రేక్ రాలేదు. కొత్త జంటతో ఐటం చేసినా గుర్తింపు రాలేదు. ఈ స్ధితిలో ఉన్నామెకు పూరి జగన్నాథ్ ద్వారా బ్రేక్ వచ్చే పరిస్ధితి కనపడుతోంది. ఆమెను ఎన్టీఆర్ తో తాను తీయబోతున్న చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా ఎపింక చేసారు. ఈ విషయాన్ని ఆమె ఖరారు చేసింది.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణేశ్‌ నిర్మించే చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. దర్శకుడు పూరి జగన్నాథ్‌ నూతన కార్యాలయం 'కేవ్‌'లో ఈ చిత్రం ప్రారంభం కావడం అంతటా ఆసక్తిని రేపింది. ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా కాజల్ చేస్తోంది.

Madhurima in Puri-NTR's film

బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ 'ఎన్టీఆర్‌తో 'బాద్‌ షా' సూపర్‌హిట్‌ తరువాత చేస్తున్న సినిమా ఇది. అలాగే పూరి జగన్నాథ్‌తో కూడా మా బేనరులో ఇది రెండో సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ ఇది. కాజల్‌ కథానాయిక. శనివారం నుంచి ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుంది. వచ్చే జనవరి 9న విడుదల చేస్తాం' అని తెలిపారు.

ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, బెనర్జీ, వెన్నెల కిశోర్‌, జయప్రకాశ్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్రాలోకేశ్‌ ఇతర ముఖ్యపాత్రలను పోషించే ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సమర్పణ: శివబాబు, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X