twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ హీరోయిన్...రామ్ చరణ్ సినిమాలో

    By Srikanya
    |

    అల్లరి నరేష్ సరసన సరదాగా కాసేపు చిత్రంలో నటించిన తాజాగా రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ లో నటిస్తోందని విశ్వసనీయమైన సమాచారం. బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆమె పాత్ర తక్కువే అయినా కీలకమైనదని తెలుస్తోంది. ఇక మధురిమ..అజయ్ చిత్రం ఆ ఒక్కడే తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తనీష్ సరసన మౌనరాగం చిత్రంలో చేసింది. ఆ తర్వాత సరదాగా కాసేపులోనూ ..ఇప్పుడు ఆరెంజ్ లోనూ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా చేస్తోంది. ఆమె తొలిసగమంతా ఫారిన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో కొనసాగడం వల్ల ప్రథమార్ధమంతా మోడ్రన్‌ డెస్సుల్లో ఆధునిక యువతిగానూ, ద్వితీయార్థమంతా అంతా సంప్రదాయ దుస్తుల్లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తానని జెనీలియా తెలిపింది. ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా షాజన్‌ పదమ్ ‌సీ నటిస్తోంది. ఆమె ఈ చిత్రంలో టీనేజ్‌ అమ్మాయిగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది. సినిమా ఫ్లాష్ ‌బ్యాక్‌ సన్నివేశాల్లో ఆ పాత్ర వస్తుంది. ఇక ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రభు, సుమన్, ప్రగతి, కిషోర్, ప్రణతి తదితరులు ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, సంగీతం: హేరిస్ జైరాజ్, ఫొటోగ్రఫీ: కిరణ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మన్యం రమేష్, నిర్మాత: కె.నాగేంద్రబాబు, దర్శకత్వం: 'బొమ్మరిల్లు' భాస్కర్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X