ఎన్టీఆర్ కు హీరోయిన్ గా కాదు...చెల్లిగా చేస్తోంది

By Srikanya

హైదరాబాద్: అజయ్ హీరోగా వచ్చిన 'ఆ ఒక్కడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మధురిమ. ఆ తర్వాత ఆమె సరదాగా కాసేపు అంటూ వంశీ దర్శకత్వంలో నటించినా అవకాశాలు రాలేదు. ఇటీవల 'కొత్తజంట'లో ఓ ప్రత్యేక పాటలో కనిపించి సందడి చేసింది. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తాజాగా ఓ బంపర్‌ ఆఫర్‌ అందుకుంది. ఎన్టీఆర్‌, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌తో తెరకెక్కబోయే చిత్రంలో సెలక్ట్‌ అయ్యింది. ఈ విషయాన్ని మధురిమ స్వయంగా తెలిపింది.

అయితే మధురిమ ఈ చిత్రంలో చేస్తోంది అనగానే..సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది అనుకున్నారు. అయితే ఆమె ఎన్టీఆర్ కు చెల్లిగా చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఆమె పాత్ర చిత్రంలో కీలకమైంది కావటంతో పేరున్న ఆమెను తీసుకోవాలని రెగ్యులర్ గా చెల్లి వేషాలు వేసేవారిని ప్రక్కన పెట్టి ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Madhuurima playing NTR Sister Role

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఆ మధ్యన ప్రారంభం అయ్యి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ కాజల్‌ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సినిమా పూర్తి చేసి విడుదల చేయాలనే ఆలోచనలో పూరీ ఉన్నట్లు సమాచారం.

బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ 'ఎన్టీఆర్‌తో 'బాద్‌ షా' సూపర్‌హిట్‌ తరువాత చేస్తున్న సినిమా ఇది. అలాగే పూరి జగన్నాథ్‌తో కూడా మా బేనరులో ఇది రెండో సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ ఇది. వచ్చే జనవరి 9న విడుదల చేస్తాం' అని తెలిపారు.

ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, బెనర్జీ, వెన్నెల కిశోర్‌, జయప్రకాశ్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్రాలోకేశ్‌ ఇతర ముఖ్యపాత్రలను పోషించే ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సమర్పణ: శివబాబు, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X