twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర వంద రోజుల పండుగ బడ్జెట్ అంతా?

    By Srikanya
    |

    రామ్ చరణ్ తేజ, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మగధీర చిత్రం వందరోజుల పండుగకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. అయితే ఈ పంక్షన్ కూడా సినిమాలాగే హిస్టరీ క్రియేట్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఈ పంక్షన్ నిమిత్తం మూడు కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. శతదినోత్సవ వేడుకలు అరుదై పోయిన ఈ సమయంలో రామ్ చరణ్ కు ఈ చిత్రం వేడుకలు జరిపి మిగతా హీరోల కన్నా ఓ మెట్టు పైన నిలబెట్టాలని చిరంజీవి సైతం ఆశిస్తున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 19న జరిగే ఈ పంక్షన్ కు తెలుగు సినీ ప్రముఖులను అందరినీ పిలుస్తున్నారు. అలాగే చిరంజివి,రామ్ చరణ్ అభిమాన సంఘాలను ప్రత్యేకంగా ఈ పంక్షన్ పై దృష్టి పెట్టమని ఆదేశాలు వెళ్లాయి. ఇక తమిళ చిత్ర పరిశ్రమ నుండి సైతం సినీ పెద్దలను ఆహ్వానిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా హిందీ గజనీ అమీర్ ఖాన్ ఈ పంక్షన్ కు ప్రత్యేక ఆకర్షణ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ సరేసరి..ఆయన కమల్ హాసన్ ప్రత్యేక ఆహ్వానితులు అని వినపడుతోంది. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X