'మగధీర' అంత పెద్దదా?

ఇక ఈ చిత్రంలో చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ ఘరానామొగుడు లోని బంగారు కోడి పెట్ట పాట ను రీమిక్స్ చేసారు. అంతేగాక చిరంజీవి సైతం తన కుమారుడుతో కలిసి స్టెప్స్ వేసి తన అభిమానులను అలరించనున్నారు. ఇక ఇప్పటివరకూ ఒక్క ప్లాప్ కూడా లేని రాజమౌళి డైరక్ట్ చేయటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. రాజస్ఠాన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పునర్జమన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేసారని వినికిడి. గీతా ఆర్ట్స్ పై గజనీ తర్వాత ఎక్కువ బడ్జెట్ లో నిర్మితమైన చిత్రం ఇదేనని తెలుస్తోంది. ఇక మగధీర చిత్రం షూటింగ్ వర్కింగ్ డేస్ 220 రోజులని సమాచారం. రాజమౌళి గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు దేనికీ ఇంతకాలం కాలేదని, అలాగే రోజులకు తగ్గట్లే భారీ బడ్జెట్ అయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











