'మగధీర' కి అంత డెఫిసిట్?
"మగధీర" చిత్రానికి అనుకున్న దానికన్నా బడ్జెట్ భారీగా అయినట్లు మొదట నుంచి వినపడుతున్నదే. ఇప్పుడు ఐదు కోట్లు డెఫిసిట్ తో రిలీజ్ అయ్యేటట్లు ఉందని ఫిలిం సర్కిల్ లలో చెప్పుకుంటున్నారు. వారి మాటలు ప్రకారం మగధీర చిత్రం బడ్జెట్ దాదాపు ముఫ్ఫై ఎనిమిది కోట్లు దాకా అయిందని అంతటా వినిపిస్తోంది. నిజానికి మన తెలుగు సినిమాకి అంత భారీ స్ధాయిలో మార్కెట్ లేకపోవటంతో అంతా ఆలోచనలో పడుతున్నారు. అయితే అల్లు అరవింద్ సామాన్యుడు కాదని గజనీకి ఓ రేంజిలో ఖర్చుపెట్టి భారీగా సంపాదించాడని దీనికీ అలాంటి మ్యాజిక్ జరగవచ్చుననే ఆశాభావం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం పునర్జన్మల చుట్టూ తిరుగుతుంది. నాలుగు వందల ఏళ్ళ క్రిందట ప్రారంభమయ్యే కథతో ఈ చిత్రం సోషియో ఫాంటిసీగా కథనం కదం తొక్కుతుంది. ఇప్పటికే యూ ట్యూబ్ ద్వారా కొన్ని లీక్ అయిన విజువల్స్ అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. టైటిల్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇవన్నీ ఎలా విజయం పై ఎవరికీ సందేహం లేదు. ఉన్న అనుమానం అంతా ఈ రేంజి ఖర్చుని తిరిగి రాబట్టాలంటే ఎంత కాలం సినిమా ఆడాలన్న విషయం పైనే.


Click it and Unblock the Notifications











