twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర కత్తి, డాలు ఆక్షన్ లో అంత రేటు రాలేదా?

    By Srikanya
    |

    మగధీర చిత్రంలో రామ్ చరణ్ ఉపయోగించిన కత్తి, డాలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆన్ లైన్ లో వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఆక్షన్ ప్రైస్ ను ఒక లక్షగా నిర్ణయించారు. మగధీర హిట్టయిన రేంజిలోనే ఈ వేలంలో చాలా ఎక్కువ మొత్తానికి అభిమానులు ఈ వస్తువులను సొంతం చేసుకుంటారని అంతా ఆశించారు. అయితే కేవలం లక్షా అరవే వేలకే హైయిస్ట్ కోట్ అయినట్లు సమాచారం. ఆ రేటు కోట్ చేసిన మెగా ఫ్యాన్ రంజిత్ కోక దీనిని సొంతం చేసుకున్నారు.

    ఇక మొదట ఆక్షన్ ప్రారంభించగానే కత్తిని నటుడు శివాజీరాజా 20 వేలు, డాలుకు వేణుమాధవ్ 25 వేలు ప్రకటించగా రెండింటిని కలిపి గీతా ఆర్ట్స్ తరపున బీవీయన్ యన్ ప్రసాద్ లక్షరూపాయలు ప్రకటించారు. ఇక ఆక్షన్ లో గెలిచిన వారికి కత్తి, డాలు లను రామ్ చరణ్, కాజల్, అల్లు అరవింద్, రాజమౌళి. తమ స్వహాస్తాలతో వీటిని అందించనున్నారు.

    ఇక ఇంతకు ముందు కూడా అదుర్స్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాడిన జాకెట్ (కోటు), హ్యాట్ (టోపీ)లను కూడా వేలంలో పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఓ పోర్టల్‌ను నడుపుతున్న అమెరికాలోని లాస్ ఏంజలెస్ ‌కు చెందిన ఎన్నారై మురళీ రవి జాకెట్ దక్కించుకోగా, హైదరాబాద్‌ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్‌గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ హ్యాట్ ‌ను పొందారు. మరి ఇక భవిష్యత్ లో మా అశోశియేషన్ ఇంకేమి వేలానికి పెట్టనున్నారో..కొందరైతే మరో మెగా అరుంధతి చిత్రంలో డ్రస్ లను వేలానికి పెడితే బావుంటుందని సూచిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X