'మగధీర'గా మళ్ళీ దూకబోతున్న రాంచరణ్!
తొమ్మిదేళ్ల క్రితం మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మగధీర చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సమయంలో మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుత దృశ్య కావ్యంగా మలిచారు.
కాజల్ అగర్వాల్, రాంచరణ్ జంటగా నటించిన ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో ప్రేమ కథగా సాగుతోంది. రాంచరణ్ పోరాటాలు అబ్బురపరిచే విధంగా దర్శకుడు రూపొందించారు. మరో మారు మెగాపవర్ స్టార్ రాంచరణ్ మగధీరగా థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.

కానీ ఇక్కడ కాదు. మగధీర నిర్మాతలు ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం మగధీర చిత్రాన్ని ఆగష్టు 31 న జపాన్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రం తో దర్శకుడు రాజమౌళికి జపాన్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు మగధీర చిత్రాన్ని జపాన్ లో విడుదల చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











