ఓ హీరోను వదిలేసి.. మరో హీరోతో కీర్తి సురేష్ రొమాన్స్
మహానటి ఘన విజయం అందాల తార కీర్తి సురేష్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఆ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కోసం దక్షిణాది నిర్మాతలు క్యూ కడుతున్నారట. ప్రస్తుతం విక్రమ్ జతకట్టి కీర్తి సురేష్ నటించిన సామి స్వ్కేర్ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ క్రమంలో శింబుతో మానాడు చిత్రంలో, శశికుమార్‌తో కొంబు వేచా సింగం అనే చిత్రంలో నటించమని ఆఫర్లు వచ్చాయి.
అయితే దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న పొలిటికల్ సెటైర్ చిత్రంలో నటించమని కీర్తీ సురేష్‌ను సంప్రదించారట. అందుకు ఆమె సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అధికారికంగా కొన్ని వ్యవహారాలు పూర్తి కావాల్సి ఉండటంతో బయటకు వెల్లడించడం లేదట.

ఇక శశికుమార్‌తో ఎస్ఆర్ ప్రభాకరన్ రూపొందించే సినిమాపై కీర్తి సురేష్ పెద్దగా స్పందించడం లేదట. మంచి ప్రాజెక్టుల కోసం ఎదురుచూడటమే ప్రధాన కారణమని చెప్పుకొంటున్నారు. కీర్తీ సురేష్ తీరుతో ప్రభాకరన్, శశికుమార్ అసంతృప్తికి గురవుతున్నారట.
విక్రమ్ కలిసి నటించిన సామి స్క్వేర్ చిత్రం సెప్టెంబర్ 21న రిలీజ్ కానున్నది. అలాగే విజయ్‌తో సర్కార్ చిత్రం కోసం జతకట్టింది. ఈ చిత్రం దీపావళీకి రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











