భారీ రేటుకు మహానటి సినిమా శాటిలైట్ రైట్స్.. ఎంతో తెలుసా?
నిర్మాత అశ్వినీదత్ అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'మహానటి'. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ ఎంపిక కాగాటాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, విజయ్అ దేవరకొండ రిపోర్టర్స్లా పాత్రల్లో కనిపించడం జరిగింది. సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో అద్భుతంగా నటించాడని వినిపిస్తుంది.
చే ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి నటులు కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించి సినిమాకు మరింత ఆకర్షణ కల్పించారు. మహానటి సినిమా శాటిలైట్ రైట్స్ ఇంతవరుకు అమ్ముడుపోలేదు . సినిమాపై అంచనాలు ఉన్నప్పటికీ ఎవ్వరూఈ సినిమాను కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

మహానటి సినిమా విడుదలై అన్ని చోట్ల సక్సెస్ సాధించిన కారణంగా జీ తెలుగు, జెమిని ఛానెల్స్ మధ్య గట్టిపోటీ నడుస్తుందని సమాచారం. చివరికి ఏ ఛానల్ ఈ సినిమా రైట్స్ సంపాదించుకుంటుందో చూడాలి. ఎంతలేదన్నా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 10 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలుసంయుక్తంగా స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించారు.


Click it and Unblock the Notifications











