ఎన్టీఆర్ బయోపిక్: ఆ నిర్ణయమే కొంపముంచిందా.. మొదట ఏమనుకున్నారు!

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలయింది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న విడుదలకు సిద్ధం అవుతోంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంతో కూడుకున్న ఎన్టీఆర్ మహానాయకుడుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. తాజాగా ఈ చిత్రంపై పలు ఆంగ్ల పత్రికలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.

బాలయ్య సంతృప్తిగా లేరా

బాలయ్య సంతృప్తిగా లేరా

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం నిరాశపరిచిన తర్వాత మహానాయుడు విషయంలో జాగ్రత్తపడే అవకాశం కూడా చిత్ర యూనిట్ కి లేకుండా పోయింది. మహానాయకుడు ఎక్కువభగం షూటింగ్ ముందుగానే పూర్తయిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర విషయంలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల బాలయ్య సంతృప్తిగా లేరనేది తాజాగా వెలువడుతున్న వార్తల సారాంశం.

ఆ నిర్ణయమే బెడిసికొట్టిందా

ఆ నిర్ణయమే బెడిసికొట్టిందా

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు రెండుభాగాలుగా రూపొందించాలని అనుకోలేదు. ఎన్టీఆర్ జీవితం మొత్తాన్ని ఒకే చిత్రంగా రూపిందించాలని భావించారట. కానీ దర్శకుడు క్రిష్ షూటింగ్ దశలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవితంలో అనేక విశేషాలు ఉన్నాయి. వాటన్నింటిని ఒకే చిత్రంలో చూపించడం సాధ్యం కాదని భావించిన క్రిష్ రెండు భాగాలుగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం నిరాశపరచడంతో ఆ ప్రభావం మహానాయకుడు మీద కూడా పడనుంది.

Recommended Video

RGV Calls Indira Gandhi Saluting NT Rama Rao A Lie | FILMIBEAT TELUGU
ట్రైలర్ కూడా

ట్రైలర్ కూడా

ఇక ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి సంబంధించి ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదల చేయడం కూడా బాలయ్యకు ఇష్టం లేదట. మొదటి భాగం ట్రైలర్ లోనే సెకండ్ పార్ట్ కి సంబందించిన విజువల్స్ చూపించారు. మరో ట్రైలర్ విడుదుల చేస్తే కథపై అభిమానులకు పూర్తి క్లారిటీ వచేస్తుందని బాలయ్య భావించాడట. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కూడా అలాగే ఉంది. ట్రైలర్ సినిమాపై పూర్తి అవగాహన కల్పించేలా ఉందని సినీ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

కోపంతో బాలయ్య

కోపంతో బాలయ్య

దీనితో క్రిష్ నిర్ణయాలపై బాలయ్య ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం బయ్యర్లకు నష్టం కలిగించడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంతో బయ్యర్లకు నష్టపరిహారాన్ని చెల్లించనున్నారు. ఆ మేరకు బయ్యర్లతో డీల్ కుదిరింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఫ్రిబ్రవరి 22న విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X