పవన్ కళ్యాణ్ పై రాజశేఖర్ సెటైర్స్?
హైదరాబాద్: రాజశేఖర్ హీరోగా నటించిన 'మహంకాళి' సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంపై సెటైర్స్ ఉన్నట్లు అంతటా వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ చిత్రంలో రోస్ రోజ్ రోజా పువ్వా అంటూ రాజశేఖర్ ని ఉద్దేశించి అంత్యాక్షరి తో ఫన్ గా ఓ ఎపిసోడ్ ఉంది. సినిమాలో బాగా పేలిన ఆ ఎపిసోడ్ పై అప్పట్లో రాజశేఖర్,జీవిత చాలా ఫైరయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ చిత్రంలో గబ్బర్ సింగ్ పై సెటైర్స్ వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకురాలు జీవిత మాట్లాడుతూ...'మహంకాళి' సినిమాలో టెర్రరిజంపై, పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌పై ఓ పోలీసాఫీసర్ వ్యక్తిగతంగా ఎలా పోరాడాడు? నిజాయితీగా పనిచేయాలనుకున్న అతను ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అతని కుటుంబం ఏమైంది? చివరకి అనుకున్నది ఎలా సాధించాడనేదే 'మహంకాళి' సినిమా. ఇది అందరిలోనూ ఆలోచన రేకెత్తించే సినిమా. రాజశేఖర్‌కి చాలా రోజుల తర్వాత అభినయించడానికి డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న కేరక్టర్ లభించింది. ఆయన అభినయం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. సినిమా విషయంలో మేమెంత సంతృప్తికరంగా ఉన్నామో ప్రేక్షకులు కూడా అలాగా ఫీలవుతారనీ, సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారనీ అనుకుంటున్నాం అన్నారు.
ఇక ఈ సినిమాకి మొదట కార్తికేయ అనే అతను డైరెక్టర్. తర్వాత అతని ప్లేస్ లో జీవిత వచ్చి మెగాఫోన్ పట్టింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ... మేకింగ్ టైమ్‌లో కార్తికేయ అసౌకర్యంగా ఫీలవుతుంటే, అతనికి మరింత ఇబ్బంది కలిగించకుండా రాజశేఖర్ మాట ప్రకారం నేను డైరెక్షన్ చేపట్టాను. బేసికల్‌గా రాజశేఖర్ కానీ, నేను కానీ ఒకర్ని బాధపెట్టడాన్ని ఇష్టపడం. కానీ జరిగేది ఒకటైతే మరొకటి ప్రచారంలోకి రావడం బాధ కలిగిస్తుంటుంది అందామె.


Click it and Unblock the Notifications











