మహేశ్ - రాజమౌళి మూవీ అసలు టైటిల్ లీక్: అన్ని భాషలకూ సెట్ అయ్యేలా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ఎన్నో క్రేజీ కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ల వాళ్ల అభిమానులకే కాకుండా సినీ ప్రియులు కోరుకున్న కొన్ని కలయికలు సాధ్యం అవుతున్నాయి. అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కాంబో ఒకటి. ఎప్పుడో రావాల్సిన వీళ్ల ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది.

భారీ భారీ సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేయాలని టాలీవుడ్‌లోని హీరోలందరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ టాప్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించాడు. ఫలితంగా అప్పటి నుంచే ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Maharaja Title Fix For SS Rajamouli and Mahesh Babu Movie

ఎంతో ప్రతిష్టాత్మకమైన కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్టు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై పని చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్టును పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.

హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. త్వరలోనే దీన్ని అధికారికంగా మొదలు పెట్టబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

Maharaja Title Fix For SS Rajamouli and Mahesh Babu Movie

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా చర్చలే జరుగుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 'మహారాజా' అనే పేరు ఖరారు చేశారట. ఇది అన్ని భాషలకూ సెట్ అయ్యేలా ఉంటుందన్న కారణంతోనే దీన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్​గా, కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ సూపర్​వైజర్​గా, తమ్మి రాజు ఎడిటర్​గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్​గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X