‘మహర్షి’ వివాదం... అశ్వినీ దత్ వ్యవహారంపై మహేష్ బాబు, దిల్ రాజు సీరియస్?
Recommended Video
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తయి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పారిస్ వెకేషన్లో ఉన్న మహేష్ బాబు ఇండియా తిరిగి వచ్చిన అనంతరం సినిమా ప్రమోషన్లలో బిజీగా కాబోతున్నారు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయంలో రూమర్ తెరపైకి వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో అశ్వినీదత్ వ్యవహారంపై మహేష్ బాబు, దిల్ రాజు ఆగ్రహంగా ఉన్నారట. అవసరం అయితే లీగల్‌గా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ ఆంగ్లపత్రిక కథనం.

‘మహర్షి' నిర్మాణంలో దత్‌కు చోటు కల్పించిన మహేష్ బాబు
గతంలో మహేష్ బాబు హీరోగా అశ్వినీదత్ తీసిన ‘సైనికుడు' చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ సమయంలో దత్ చాలా నష్టపోయాడు. అప్పడు ఇచ్చిన మాట ప్రకారం ‘మహర్షి' నిర్మాణంలో ఆయనకు మహేష్ బాబు చోటు కల్పించాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ సెట్టయింది. నిర్మాత పివివి కూడా ఇలాంటి కారణాలతోనే ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.

దిల్ రాజు, దత్, పివిపి
‘మహర్షి' సినిమాలో టాలీవుడ్ బడా నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. అయితే సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ బాధ్యతలు అన్నీ కూడా దిల్ రాజు చూసుకోవడం... సినిమా వల్ల వచ్చే లాభాల్లో వారి వారి పెట్టుబడుల ప్రకారం లాభాల్లో షేర్ తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ముగ్గురు నిర్మాతలు తీస్తున్న సినిమా కావడంతో ‘మహర్షి’ మూవీ బిగ్ ప్రాజెక్టుగా అవతరించింది.

కృష్ణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో వివాదం
సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు దిల్ రాజు హ్యాండిల్ చేసేలా అగ్రిమెంటులో రాసుకున్నారట. అయితే ఇపుడు కృష్ణ జిల్లా రైట్స్ తనకే కావాలని అశ్వినీదత్ బీష్మించుకుని కూర్చోవడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు, దిల్ రాజు సీరియస్
అశ్వినీదత్ వ్యవహారంపై మహేష్ బాబు, దిల్ రాజు సీరియస్‌గా ఉన్నారట. ఆల్రెడీ సినిమా ప్రారంభం అవ్వడానికి ముందే అన్ని విషయాలు క్లియర్‌గా అగ్రిమెంట్ రాసుకున్నప్పటికీ ఆయన ఇలా చేయడం వారిని నొప్పించినట్లు టాక్. మరి ఈ వార్తల వెనక నిజం ఎంత? అనే విషయంలో చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











