రాముడిగా రామ్ చరణ్.. మహావతార్ నర్సింహా దర్శకుడి ప్లాన్ సూపర్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత చరణ్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగింది. దీంతో చరణ్ నుంచి వచ్చే సినిమాలపైనా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే చరణ్ తో కలిసి పనిచేయడానికి ఇటు సౌత్, అటు బాలీవుడ్ డైరెక్టర్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో మహావతార్ నర్సింహా చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు అశ్విన్ కుమార్ చరణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బాక్సాఫీస్ వద్ద మహావతార్ నర్సింహా దూకుడు..
హిందూ మైథాలజీ యాక్షన్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా. ఈ చిత్రాన్ని కన్నడ చిత్ర పరిశ్రమలోని ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించారు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మొదటి ఇన్స్టాల్మెంట్ లో మహావతార్ నర్సింహాను జూలై 25న వరల్డ్ వైడ్ గా విడుదల చేశారు. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిత్రానికి దేశ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కుతోంది.

ఇక ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. సినిమా ఓపెనింగ్ డే బాక్సాఫీస్ వద్ద కేవలం 3 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. మొదటి మూడు రోజుల్లో వసూళ్లు పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ వసూళ్లలో ఏమాత్రం తగ్గడం లేదు. 16 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయడం విశేషం. ఇక సినిమా సక్సెస్ సందర్భంగా దర్శకుడు అశ్విన్ కుమార్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ గురించి ఇలా మాట్లాడారు.
రామ్ చరణ్ గురించి..
మహావతార్ నర్సింహా చిత్రం విడుదలకు ముందే హోంబలే ఫిల్మ్స్ వారు సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని ప్రకటించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మహావతార నర్సింహా తర్వాత, రఘునందన్, పరుశురామ్, ద్వారకాదీష్, ఆదిపురుష్, గోకులానంద, కల్కి వంటి సిరీస్ లను చేయబోతున్నానమని తెలిపారు. ఇందులో రాముడి పాత్రలో ఏ హీరోతో సినిమా చేస్తారనే ప్రశ్నకు అశ్విన్ కుమార్ రామ్ చరణ్ పేరును చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
రామ్ చరణ్ రాముడిగా బాగా మెప్పించగలడు. ఇక కృష్ణుడిగా మాత్రం హృతిక్ రోషన్ ను తీసుకుంటానని దర్శకుడు అశ్విన్ కుమార్ చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాముడిగా కనిపించారు. అయితే మహావతార్ సినిమాటిక్ సిరీస్ మొత్తం యానిమేషన్, గ్రాఫిక్, వీఎఫ్ఎక్స్ రూపంలోనే రూపుదిద్దుకుంటోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











