పవర్ ఫుల్ స్టోరీ లైన్‌తో మహేష్ సినిమా.. కెరీర్‌లో ఇంత వరకు చేయని పాత్ర!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రానికి అంతా సిద్ధం అవుతోంది. అశ్వినీదత్, దిల్ రాజు కలసి ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ సినిమాని కనీవినీ ఎరుగని విధంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఉన్నాడు. భరత్ అనే నేను చిత్ర విజయం తరువాత మహేష్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ చిత్ర కథకు సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడే లీకులు మొదలైపోయాయి.

సోషల్ మెసేజ్‌తో మహెష్
మహేష్ నుంచి ఈ మధ్య కాలంలో సోషల్ మెస్సేజ్ తో కూడుకున్న కథలు ఎక్కువగా వస్తున్నాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు ఆ కోవకు చెందినవే. మహేష్ బాబు మరో మారు అలాంటి ప్రయోగమే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహెష్ తన 25 వ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రం జూన్ 9 నుంచి ప్రారంభం కాబోతోన్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

అద్భుతమైన స్టోరీలైన్
రైతు సమస్యలు, తండ్రి కొడుకుల బంధం అనే స్టోరీ లైన్ తో తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు రైతుగా మారిపోతాడట. ఇటీవల మహేష్ ఈ చిత్రం కోసం గడ్డం కూడా పెంచుతున్నాడు. మహేష్ బాబు లుక్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది.

కీలకమైన పాత్రలో
అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో మహేష్ స్నేహితుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ నిరుపేద వ్యక్తిగా కూడా నటిస్తాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











