twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహేష్ 26’ అగ్రిమెంట్ లీక్.. రంగంలోకి నమ్రత, నిర్మాత టచ్ చేయడట, అతడి వాటా అంతేనా?

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' మూవీ తర్వాత వెంటనే మరో సినిమా షూటింగులో బిజీ కాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించబోతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన డీల్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

    ఈ చిత్రాన్ని మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండా రూ. 50 కోట్ల బడ్జెట్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. అయితే మహేష్ బాబు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంలోనే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

    మహేష్ 26 అగ్రిమెంట్ లీక్?

    మహేష్ 26 అగ్రిమెంట్ లీక్?

    తాజాగా ఈ సినిమా సంబంధించిన అగ్రిమెంట్ వివరాలు బయటకు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో బడ్జెట్, నిర్మాతకు దక్కాల్సిన వాటా, డైరెక్టర్ రెమ్యూనరేషన్, మహేష్ బాబుకు ఎంత మొత్తం వెళుతుంది అనే ఆసక్తిక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    దర్శకుడు అనిల్ రావిపూడికి కండీషన్?

    దర్శకుడు అనిల్ రావిపూడికి కండీషన్?

    ఈ అగ్రిమెుంటు ప్రకారం రూ. 50 కోట్లలో సినిమాను కంప్లీట్ చేయాలని, ఇందులోనే కాస్ట్ అండ్ క్రూ రెమ్యూనరేషన్లతో పాటు ప్రొడక్షన్ ఖర్చు కవర్ అయ్యేలా ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలని, 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడికి కండీషన్ పెట్టారట.

    ఇది పిరికిపందల చర్యే: శ్రీలంక పేలుళ్లపై మహేష్ బాబుఇది పిరికిపందల చర్యే: శ్రీలంక పేలుళ్లపై మహేష్ బాబు

    నిర్మాతకు దక్కేది అది మాత్రమేనా?

    నిర్మాతకు దక్కేది అది మాత్రమేనా?

    ఈ అగ్రిమెంటు ప్రకారం... రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టే నిర్మాతకు కేవలం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముకునే హక్కు మాత్రమే ఉంటుందట. అంటే సినిమాను వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మడం ద్వారా ఎంత వస్తే అంత మొత్తం ఆయనకు దక్కుతుంది. ఈ రైట్స్ అమ్మడం ద్వారా రూ. 90 నుంచి 95 కోట్లు వస్తాయని అంచనా. ‘మహర్షి' భారీ విజయం అందుకుంటే దాని తర్వాత వచ్చే మూవీ కాబట్టి ఈ మొత్తం రూ. 100 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.

    రంగంలోకి నమ్రత, నిర్మాత టచ్ కూడా చేయడట

    రంగంలోకి నమ్రత, నిర్మాత టచ్ కూడా చేయడట

    ఈ చిత్రం శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ మీద పూర్తి హక్కు మహేష్ బాబుకు దక్కినట్లు తెలుస్తోంది. వీటి విషయంలో నిర్మాత వేలు కూడా పెట్టడని, మహేష్ బాబు భార్య నమ్రత స్వయంగా వీటిని డీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    కార్పొరెట్ వ్యవహారాలు డీల్ చేయడంలో నమ్రత దిట్ట

    కార్పొరెట్ వ్యవహారాలు డీల్ చేయడంలో నమ్రత దిట్ట

    కార్పొరెట్ వ్యవహారాలు డీల్ చేయడంలో నమ్రత దిట్ట. ఆమె వీటిని భారీ మొత్తానికి అమ్మడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని ద్వారా కనీసం రూ. 40 నుంచి రూ. 50 కోట్లు మహేష్ బాబు ఖాతాలో పడేట్లు నమ్రత బిజినెస్ డీలింగ్స్ చేయబోతున్నారట.

    అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఎంత?

    అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ ఎంత?

    సినిమాకు కెప్టెన్ డైరెక్టరే. అతడి రెమ్యూనరేషన్ కూడా కీలకంగా ఉంటుంది. ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం ఉంది. అయితే ఇది రూ. 50 కోట్ల బడ్జెట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందా? లేక నిర్మాత ఇస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

    English summary
    Film Nagar source said that, As per the agreement, the producer Mahesh 26, has parted the bouquet rights of satellite, Hindi dubbing rights and digital rights to Mahesh Babu as part of his remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X