మహేష్ 27 ఫిక్స్: చివరకు ఆ డైరెక్టర్‌తో రెడీ అయిన మహేష్ బాబు
వరుస హిట్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించారు. మహేష్ కెరీర్‌లో 26వ సినిమాగా వచ్చిన ఈ మూవీ పలు రికార్డులు తిరగరాసింది.
ఇన్ని రోజులు 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ ఎంజాయ్ చేసిన మహేష్ ఫ్యాన్స్.. ఇక ఇప్పుడు ఆయన 27వ సినిమాపై కన్నేశారు. మరోవైపు మహేష్ బాబు కూడా తన 27వ సినిమాను ట్రాక్ ఎక్కించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల క్యాన్సిల్ అయిందని తెలిసింది.

ఆ వెంటనే డైరెక్టర్ పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. కథలను వినడంలో నిమగ్నమై ఉన్న మహేష్.. పరశురామ్ కథ విని ఓకే కూడా చేశారని టాక్ బయటకొచ్చింది. కానీ తాజా సమాచారం మేరకు మహేష్ 27 డైరెక్టర్ పరశురామ్ కూడా కాదని, భీష్మ సినిమాతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుములతో ఈ ప్రాజెక్టు ఉండనుందని మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
డైరెక్టర్ వెంకీ కుడుముల రీసెంట్‌గా మహేశ్‌ని కలిసి కథ చెప్పాడట. వెంకీ చెప్పిన పాయిట్ నచ్చడంతో.. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని మహేశ్ అన్నాడని సినీ వర్గాల్లో టాక్ ముదిరింది. చూడాలి మరి మహేష్ 27 చివరకు ఏ డైరెక్టర్‌తో కన్ఫామ్ అవుతుందో!.


Click it and Unblock the Notifications











