మహేష్ సతీమణి రికమండేషన్.. సూపర్ స్టార్‌కి సరైన జోడీ ఆమెనే!
వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు మహేష్ బాబు. బ్లాక్‌బస్టర్ సినిమాలు ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న ఈ హీరో ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ''బ్లాక్‌బస్టర్ కా బాప్'' హిట్ కొట్టేశాడు. ఇక ఇదే జోష్‌లో తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు మహేష్. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన నటించనున్న హీరోయిన్ విషయమై నమ్రత ఓ హీరోయిన్‌ని ప్రత్యేకంగా రికమండ్ చేస్తోందట. మారి ఆ హీరోయిన్ ఎవరు? ఆమెపైనే నమ్రతకు ఎందుకంత ఇంట్రెస్ట్? ఆ వివరాలు చూద్దామా..

మహేష్ 27వ సినిమా.. మళ్ళీ ఆ డైరెక్టర్‌తోనే
మహేష్ 25వ సినిమా 'మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే తన 27వ సినిమాను చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ సహా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా మే నెలలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందులో మహేష్ స్పై పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

దిల్ రాజు నిర్మాణం.. ఫ్యాన్ ఇండియా మూవీ
దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా లావిష్‌గా ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. దీని కోసం ఇప్పటికే భారీ స్కెచ్‌ని రెడీ చేసిన వంశీ పైడిపల్లి అందుకు తగిన విధంగా అన్నీ సమకూర్చుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం వెకేషన్ ట్రిప్‌లో ఉన్న మహేష్.. అమెరికా నుంచి రాగానే ఫైనల్ స్క్రిప్ట్ ఓకే చేయించుకునేలా ప్లాన్ చేశారట వంశీ.

వంశీకి నమ్రత సలహా..
స్క్రిప్ట్ పనులు చూసుకుంటూనే చిత్ర నటీనటులను, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేస్తున్నాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఇప్పటికే సంగీత దర్శకుడిగా థమన్‌ను ఫైనల్ చేశారు. ఇక మహేష్ సరసన హీరోయిన్‌గా ఎవరిని సెలక్ట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్న వంశీకి మహేష్ సతీమణి నమ్రత ఓ సలహా ఇచ్చిందని తెలుస్తోంది.
Recommended Video

రికమండేషన్.. ఆమె అయితేనే బెటర్
కొంతమంది హీరోయిన్‌లను పరిశీలించిన పిమ్మట కియారా అద్వానీ అయితేనే బెటర్ అని వంశీ పైడిపల్లికి నమ్రత చెప్పిందట. నమ్రత రికమండేషన్ మేరకు వంశీ కూడా ఆమెనే ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మహేష్‌తో కలిసి ''భరత్ అనే నేను'' రూపంలో సూపర్ హిట్ సాధించి మంచి జోడీ అని నిరూపించుకుంది కియారా. సో ఈమెనే ఫైనల్ అయితే మరోసారి ఈ ఇద్దరి జోడీ కనువిందు ఖాయమే మరి.


Click it and Unblock the Notifications











