మహేష్ బాబు సినిమాలో విజయ్ దేవరకొండ.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్
వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలు ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ''బ్లాక్‌బస్టర్ కా బాప్'' హిట్ కొట్టేసిన ఈ స్టార్ హీరో.. తన తదుపరి ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు వంశీ పైడిపెల్లి దర్శకత్వం వహించనున్నారు.
గతంలో మహేష్ 25వ సినిమా 'మహర్షి' సినిమాకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి.. మహేష్ 27 కోసం ఓ బలమైన కథ సిద్ధం చేశారట. ఈ కథ కోసం మహేష్ బాబుతో కలిసి నటించబోయే నటీనటుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు వంశీ పైడిపల్లి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ఈ సినిమాలో స్థానం కల్పించారట వంశీ.

గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కనిపిస్తాడట. ఇప్పటికే ఈ హీరోతో చర్చలు నడిపిన వంశీ.. కొన్ని డేట్స్ కూడా తీసుకున్నారని టాలీవుడ్ టాక్. గతంలో ఇలాగే మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో అల్లరి నరేశ్ చేత ఓ కీలక పాత్ర చేయించి సక్సెస్ అయిన ఈ డైరెక్టర్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో అదే ప్రయత్నం చేయబోతున్నారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే లేదా జూన్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఆపై శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











