12కోట్లకి మహేష్ ఒక ఇడియట్ అవుతాడా..!?
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ 'త్రీ ఇడియట్స్"ని శంకర్ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ షికారు చేస్తోంది. తెలుగులో మహేష్, తమిళంలో విజయ్ మెయిన్ ఇడియట్స్ గా నటించనున్నారని..ఆ తర్వాత రెండు భాషల్లోనూ మెయిన్ ఇడియట్ అయ్యే అవకాశం సూర్య కొట్టేశాడనే వార్తలు వచ్చాయి..కానీ సూర్యకు ఇడియట్ కావడం ఇష్టంలేదో ఏమోగానీ ఈ ప్రాజెక్ట్ ని వదిలేయడంతో..మళ్లీ శంకర్ విజయ్, మహేష్ లను ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలెట్టాడని సమాచారం.
ఇప్పటికే తమిళంలో విజయ్ పట్టు సడలించడంతో, ఇక శంకర్ మహేష్ ని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నాడని సమాచారం. అందుకోసం మహేష్ కి మాంచి ఆఫర్ కూడా ఇచ్చాడట..ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే? అనేగా ఈ చిత్రంలో కనుక మహేష్ నటిస్తే అక్షరాలా 12కోట్ల రూపాయల్ని రెమ్యూనరేషన్ గా ఇప్పిస్తాననే ఆఫర్ ఇచ్చాడట. ఇదే జరిగితే ఈ ఆఫర్ నే మహేష్ అంగీకరిస్తే..తెలుగు లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా ప్రిన్స్ రికార్డ్ నెలకొల్పినట్టే..మరి శంకర్ ఇచ్చిన ఈ భారీ ఆఫర్ కి మహేష్ ఎలా స్పందిస్తాడో..!?


Click it and Unblock the Notifications











