మహేష్ బాబు 26వ చిత్రం ‘ఎఫ్ 2’ దర్శకుడితో.. సుకుమార్ ఆలస్యమే కారణమా?

Recommended Video

Anil Ravapudi Is Preparing The Story For The Mahesh Movie | Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం 'మహర్షి' వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంంది. దీని తర్వాత ఆయన 26వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం... సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 26వ సినిమా చేయడం లేదని తెలుస్తోంది. అందకు కారణం సుకుమార్ ముందుగా చెప్పిన సమయానికి స్క్రిప్టు సిద్ధం చేయకపోవడమేనంట.

మరో ప్రాజెక్ట్ మీదకు షిప్ట్ అయిన మహేష్ బాబు

మరో ప్రాజెక్ట్ మీదకు షిప్ట్ అయిన మహేష్ బాబు

సుకుమార్ పూర్తి స్క్రిప్టు సిద్ధం కావడానికి మరో ఆరు నెలల సమయం కావాలని కోరడంతో ఈ గ్యాపులో మహేష్ బాబు మరో ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేష్ బాబు 26వ చిత్రం సుకుమార్‌తో కాదనే విషయం స్పష్టమవుతోంది.

అనిల్ రావిపూడికి ఛాన్స్?

అనిల్ రావిపూడికి ఛాన్స్?

‘ఎఫ్ 2' మూవీతో బ్లాక్ బస్టర్ నమోదు చేసిన అనిల్ రావిపూడి ఇటీవల మహేష్ బాబును కలిసి తన వద్ద ఉన్న లైన్ చెప్పారని, అది విని ఇంప్రెస్ అయిన మహేష్ స్క్రిప్టు సిద్ధం చేయమని చెప్పారట. అనిల్ రావిపూడి త్వరగా స్క్రిప్టు సిద్ధం చేస్తే మహేష్ 26వ సినిమా చేసే అవకాశం అతడికే దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

అతడిపై నమ్మకంగా ఉన్న మహేష్c

అతడిపై నమ్మకంగా ఉన్న మహేష్c

అనిల్ రావిపూడి గత సినిమాలతో పాటు ఇటీవల విడుదలైన ‘ఎఫ్ 2' చూసిన సూపర్ స్టార్... డైరెక్టర్ పని తీరుపై చాలా నమ్మకంగా ఉన్నారట. ఇటీవల ఎఫ్ 2 రిలీజ్ తర్వాత కూడా ప్రశంసిస్తూ సూపర్ స్టార్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తానంటున్న అనిల్ రావిపూడి

ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తానంటున్న అనిల్ రావిపూడి

మహేష్ బాబుతో సినిమాను ఆరు నెలల్లో కంప్లీట్ చేయగలను అని అనిల్ రావిపూడి చెబుతున్నారని, అన్నీ ఓకే అయితే ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X