క్రేజీ అప్‌డేట్: మహేష్ బాబుతో కీర్తి సురేష్ రొమాన్స్!

ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ మూవీగా రూపొందనున్న ఆయన నెక్స్ట్ సినిమాకు క్రేజీ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు.

నిజానికి మహేష్ బాబు తన 27వ సినిమాను వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ కావడంతో.. డైరెక్టర్ పరశురామ్ లైన్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. మే 31న సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

Mahesh Babu 27: Heroine Fix

అయితే ఈ చిత్రంలో మహేష్ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై కీలక నిర్ణయం తీసుకుందట చిత్రయూనిట్. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నాయి. మహేష్ బాబు కోరిక మేరకు ఈ సినిమాను 2021 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా మహేష్ 27 కోసం అభిమానలోకం ఆతృతగా ఎదురుచూస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X