మహేష్ బాబు డేరింగ్ స్టెప్! తిరిగి అదే బాటలో..? సూపర్ స్టార్ అభిమానుల్లో ఆందోళన
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల వరుస సక్సెస్‌లు ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న ఆయన తన తదుపరి సినిమా కోసం ఓ డేరింగ్ స్టెప్ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ మహేష్ చేస్తున్న డేర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

ఆ విషయంలో మహేష్ స్పెషల్ ఐడెంటిటీ
కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు మహేష్ బాబు. తండ్రిలాగే కౌబోయ్ లాంటి వేషాలు వేయడానికి ఇష్టపడుతూ డిఫెరెంట్ మూవీస్‌ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు మహేష్. ఇదే బాటలో స్పైడర్ లాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమా కూడా చేశారు.

టాలీవుడ్ జేమ్స్ బాండ్ ఆయనే..
అప్పట్లో మహేష్ బాబు ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎక్కువగా ఇలాంటి సినిమాలు చేసేందుకే ఇష్టపడేవారట. కృష్ణ అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన కొత్త తరహా చిత్రాల్లో కౌబోయ్ చిత్రాలతో పాటు జేమ్స్ బాండ్ చిత్రాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ జేమ్స్ బాండ్ అనగానే కృష్ణనే గుర్తొచ్చేలా ఆయన సినిమాలు ఉండేవి.

స్పైడర్ ఫ్లాప్.. తిరిగి అదే బాటలో
ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు పయనిస్తుండటం విశేషం. గతంలో ఎఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన `స్పైడర్` చిత్రంలో మహేష్ బాబు స్పై పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా చివరకు ఫ్లాప్ అయింది. అయినా ఇప్పుడు కూడా అలాంటి స్పై పాత్రలోనే నటించేందుకు మహేష్ రెడీ అయ్యారని సమాచారం.

వంశీ పైడిపల్లితో మహేష్.. 27వ సినిమా
ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ సాధించిన మహేష్.. తన 27వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ సహా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా మే నెలలో ప్రారంభం కానుంది. ఇందులోనే మరోసారి మహేష్ స్పై పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఇలా డేర్ చేస్తున్నారేమో!
గతంలో భారీ అంచనాల నడుమ విడుదలైన స్పైడర్ ఊహించని విధంగా డిసాస్టర్ అయ్యాక కూడా మళ్ళీ అలాంటి రోల్ చేసేందుకు మహేష్ రెడీ అవుతుండటం చూసి.. ఎలాగైనా ఆ పాత్రతో అలరించాలనే ఇలా డేర్ చేస్తున్నారేమో! అని చెప్పుకుంటున్నారు జనం.


Click it and Unblock the Notifications











