సూపర్ స్టార్ క్రేజీ అప్‌డేట్: మహేష్ బాబు 27 ఫిక్స్.. దర్శకుడెవరంటే!
సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం తన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో బిజీగా ఉన్న ఆయన.. త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టు మహేష్ 27ని ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫేమస్ డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. వివారాల్లోకి పోతే..

మహేష్ బాబు 26.. సరిలేరు నీకెవ్వరు
తన 25వ సినిమా 'మహర్షి'తో బ్లాక్ బస్టర్ సాధించి మంచి జోష్‌లో ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ ప్రాజెక్టు సరిలేరు నీకెవ్వరు పనుల్లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ మహేష్ అభిమానులను అబ్బురపరిచాయి.

మహేష్ 27.. ఫేమస్ డైరెక్టర్
సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఇక తన 27వ సినిమాపై దృష్టి సారించారట మహేష్. ఫేమస్ డైరెక్టర్, తనకు మహర్షి రూపంలో హిట్ ఇచ్చిన వంశీ పైడిపెల్లి దర్శకత్వంలోనే ఆయన తన 27వ ప్రాజెక్టు చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు వంశీ పైడిపెల్లి- మహేష్ బాబు మధ్య కొన్ని సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ ముగ్గురిలో ఒకరు అనుకున్నారు కానీ..
నిజానికి మహేష్ 27 విషయమై చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఆయన తదుపరి సినిమా ప్రశాంత్ నీల్, పరశురామ్, సందీప్ రెడ్డి వంగ ఈ ముగ్గురిలో ఒకరి దర్శకత్వంలో ఉంటుందని విన్నాం. కానీ తాజా అప్‌డేట్ ప్రకారం మహేష్ 27 డైరెక్టర్ వంశీ పైడిపెల్లి అని ఫిక్స్ అయినట్లు తెలిసింది.
Recommended Video

స్క్రిప్ట్ రెడీ.. అచ్చం అలాగే
ఈ ప్రాజెక్టులో 'మహర్షి' మాదిరిగానే ఆకట్టుకునే అంశంతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వంశీ పైడిపెల్లి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.


Click it and Unblock the Notifications











