మహేష్ తో 'త్రి ఇడియట్స్' రీమేక్ కన్ఫర్మ్!?
అమీర్ ఖాన్ నటించిన 'త్రి ఇడియట్స్' చిత్రం భాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ,తెలుగు రీమేక్ రైట్స్ ని జెమినీ ఫిల్మ్ సర్క్యట్స్ వారు కొన్నారని తెలుస్తోంది. దాదాపు పది కోట్ల రూపాయలు ఈ రీమేక్ కోసం వెచ్చించారని చెప్తున్నారు. ఇక తమిళ, తెలుగు భాషల్లో ఒకే సారి ఈ చిత్రం రీమేక్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్ కు విజయ్ ను అడగనున్నారని చెప్తున్నారు. ఇక తెలుగు కోసం మహేష్ ని సంప్రదించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే మహేష్ తాను షూటింగ్ బిజీలో ఉండి ఆ చిత్రం ఇంకా చూడలేదని సమాధానమిచ్చారని చెప్తున్నారు. మహేష్ కు నచ్చితే 2010లో మహేష్ చేయబోయే చిత్రాలలో ఇది ఒకటి గ్యారెంటీగా అయ్యే అవకాశం ఉంది. ఇక అనూష్క కాంబినేషన్ లో త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. ఇక జెమినీ వారు రీమేక్ విషయం తప్ప మిగతాది కన్ఫర్మ్ చేసి చెప్పటం లేదు.


Click it and Unblock the Notifications











