ఈ ఆదివారం తుఫాన్ వస్తుందంటూ... మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్ కంపెనీ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. గతంలో ఆ స్థానంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఉండగా తాజాగా ఆ స్థానాన్ని మహేష్ బాబు దక్కించుకున్నాడు. గతంలో ఏపీకి మాత్రమే పరిమితం అయిన మహేష్ బాబు ఫేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగి పోతోంది. ఈ యాడ్ వల్ల మహేష్ బాబు సినిమా మార్కెట్ కూడా ఇతర రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉంది.
మహేష్ బాబుతో చిత్రీకరించిన యాడ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ రోజు తుఫాన్ వస్తుంది అంటూ మహేష్ బాబు స్టయిల్ గా దూకడం అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ యాడ్ లో మహేష్ బాబు సరసన కింగ్ ఫిషర్ మొడల్ అంజలీనా జాన్సన్ కనిపించనుంది.
ఈ యాడ్ గురించి మహేష్ బాబు తన ట్విట్టర్లో స్పందిస్తూ...యాడ్ రాకింగ్ గా వచ్చింది. ఈ యాడ్ రూపకలప్పనలో పాల్గొన్న మొత్తం టీంకు థాంక్స్ అంటూ పేర్కొన్నారు. ఆదివారం(మార్చి 108) యాడ్ నుంచి ప్రసారం అవుతుందని చెప్పుకొచ్చారు.
మహేష్ బాబు థమ్సప్‌తో పాటు యూనివర్సల్, సంతూర్, నవరత్న ఆయిల్, ప్రొవోగ్, వివెల్, జోస్ అలుకాస్ తదితర కార్పొరేట్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











