పవన్ తొలిప్రేమ, ప్రభాస్ డార్లింగ్ చిత్ర డైరెక్టర్ తో మహేష్ బాబు..!?
తొలి ప్రేమతో దర్శకుడుగా పరిచయమైన కరుణాకరన్ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. అతను ఏ హీరోతో సినిమా చేసినా కరుణాకరన్ సినిమా అనే ఐడెంటిఫికేషన్ ఉంటుంది. తొలిప్రేమ తర్వాత అతను చేసిన యువకుడు, వాసు, బాలు, హ్యాపీ వంటి సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో అతనికి పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశాలు రాలేదు.
అప్పుడు యశోసాగర్ వంటి కొత్త హీరోలతో 'ఉల్లాసంగా ఉత్సాహంగా" చిత్రాన్ని రూపొందించి సూపర్ హిట్ చేశాడు. దాంతో ప్రభాస్ 'డార్లింగ్" చేసే అవకాశం వచ్చింది. అది కూడా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న 'ఎందుకంటే ప్రేమంట" చిత్రంతో కరుణాకరన్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కరుణాకరన్ కి మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.
ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో 'బిజినెస్ మ్యాన్" షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ ఆ సినిమా తర్వాత వెంకటేష్ కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో...."చెయ్యబోతున్నాడు. దాని తర్వాత సుకుమార్, క్రిష్ సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత కరుణాకరన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని చేసేందుకు ఓ అగ్ర నిర్మాత రెడీగా ఉన్నారని సమాచారం


Click it and Unblock the Notifications











