మహేష్ బాబుపై రామ్ గోపాల్ వర్మ కోతలేనా?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజుల కిందట సడెన్‌గా 'ఖైదీ" సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ట్విట్టర్లో ట్వీటిన విషయం తెలిసిందే. ఈ వార్త విని అంతా షాక్ అయ్యారు. దీనికి తోడే వర్మ వ్యాఖ్యలకు మద్దతుగా మరో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ట్వీటడం తో సర్వత్రా ఈ విషయం చర్చనీయాంశమైంది. మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం...వర్మ చెప్పినట్లు ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశాల లేవనే వాదన వినిపిస్తోంది. వర్మ కోసే కోతల్లో చాలా వరకు వాస్తవ రూపం దాల్చ బోవని, అందులో ఖైదీ కూడా ఒకటని అంటున్నారు. పైగా చిరంజీవీ నటించిన సినిమా రీమేక్‌లో మహేష్ బాబు నటించే అవకాశాలు అస్సలు లేవని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు పూరీ జగన్నాథ్ దర్శత్వంలో 'ది బిజినెస్ మ్యాన్" సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2012లో సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. దీని తర్వాత మహేష్ దిల్ రాజు దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో నటిస్తున్నారు. అయితే తన తండ్రి నటించిన అల్లూరి సీతారామ రాజు సినిమా రీమేక్ లో మాత్రం మహేష్ బాబు తప్పకుండా నటించాలని డిసైడ్ అయ్యాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త.


Click it and Unblock the Notifications











