Guntur karam: యంగ్ హీరోయిన్‌తో మహేశ్ సరసాలు.. గుంటూరు కారంలో ఈ సీన్స్ క్రేజీగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ బడా హీరోగా సత్తా చాటుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ దూసుకుపోతోన్నాడు. అయితే, గత చిత్రంతో మాత్రం మహేశ్ నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో 'గుంటూరు కారం' మూవీని చేస్తున్నాడు.

సుదీర్ఘ గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Mahesh Babu and Meenakshi Chaudhary Scenes Highlight in Guntur karam Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్‌కు ఆరంభంలోనే ఎన్నో బ్రేకులు వచ్చాయి. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఇది శరవేగంగా సాగుతోంది. ఎలాగైనా సంక్రాంతికి దీన్ని తీసుకు రావాలన్న పట్టుదలతో చిత్ర యూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరణను జరుపుకుంటోంది.

'గుంటూరు కారం' మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆ తర్వాత ఇందులో శ్రీలీలను కూడా భాగం చేశారు. అయితే, ఈమె పాత్ర సెకెండ్ లీడ్‌ హీరోయిన్‌గానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇప్పుడు పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీంతో రెండో హీరోయిన్‌గా హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

Mahesh Babu and Meenakshi Chaudhary Scenes Highlight in Guntur karam Movie

కుటుంబ కథతో రాబోతున్న 'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షి చౌదరి రోల్ ఎంతో ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో మహేశ్ బాబుతో వచ్చే ఆమె కాంబినేషన్ సీన్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయట. వీళ్లిద్దరి మధ్య కాస్త సరసం, టీజింగ్ సన్నివేశాలు మెప్పిస్తాయని తెలిసింది. దీంతో ఈ కాంబోపై ఆసక్తి పెరిగిపోతోంది.

Mahesh Babu and Meenakshi Chaudhary Scenes Highlight in Guntur karam Movie

'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X