Bheemla Nayak ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరో, నలుగురు స్టార్ డైరెక్టర్లు.. ఎవరెవరంటే?
వకీల్ సాబ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పుకున్నారు కానీ కరోనా కారణంగా ఆయన సినిమాలు ఏవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు రానా దగ్గుబాటితో పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనం అవుతున్నాయి. ఇక అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మొత్తానికి ఫిబ్రవరి నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా రిలీజ్ కు కొద్దీ రోజుల ముందు భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ వేడుక ఎప్పుడు? ఎక్కడ చేస్తున్నారు? అతిథులుగా ఎవరెవరు వస్తున్నారు? అనే విషయం మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఆ వివరాలలోకి వెళితే..

అయ్యప్పనుమ్ కోషియం రీమేక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

ఫిబ్రవరి 25నే విడుదల
మలయాళ మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళింది. ఫస్ట్ కాపీ రెడీ కాగానే సినిమాను సెన్సార్‌కు పంపనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అవ్వాల్సి ఉండేది. వాయిదా పడడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 25నే విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

రెండు బాషలలో
ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో B4U మోషన్ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా పోస్టర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇక ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 21న గ్రాండ్ గా నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ భారీ ఈవెంట్ కోసం హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ ను వేదికగా ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో
ఇక భీమ్లా నాయక్ ట్రైలర్ ను కూడా అదే రోజు అతిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా ఎవరెవరు వస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ముందు పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మహేష్ -రాజమౌళి;లను రప్పించాలని
ఆ ప్రచారం ప్రకారం హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్, భవదియుడు భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లతో పాటు త్వరలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్న సురేంధర్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇక తాజా ప్రచారం మేరకు ఈ ఈవెంట్ కు మహేష్ బాబు లేదా రాజమౌళితో ఎవరో ఒకరిని తీసుకురావాడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మహేష్ ఇప్పుడు సితార వాళ్ళతో సినిమా చేస్తున్నాడు. రాజమౌళిని తీసుకొస్తే హిందీ మార్కెట్ పరంగా ఉపయోగ పడే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











