SSMB28: మహేశ్ మూవీకి మరో కొత్త టైటిల్.. ఆ సినిమాతో పాటే టీజర్ రిలీజ్
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా కమర్షియల్ చిత్రాలు చేస్తూ.. బడా హీరోగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొన్నేళ్ల క్రితం వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. 'సర్కారు వారి పాట'తో సరైన హిట్‌ను అందుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మహేశ్ బాబు తన 28వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నాడు. సక్సెస్‌ఫుల్ కాంబో కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
'అతడు', 'ఖలేజా' వంటి డీసెంట్ మూవీల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత మరో షెడ్యూల్‌ను జరిపి.. ఇప్పుడు గ్యాప్ తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో జూన్ 5 లేదా 6వ తేదీ నుంచి మూడు నెలల లాంగ్ షెడ్యూల్‌ను మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమ్మ కోసం', 'అయోధ్యలో అర్జునుడు' వంటి టైటిళ్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీనికి 'అమరావతికి అటు ఇటు' లేదా 'గుంటూరు కారం'లలో ఒక దాన్ని ఫిక్స్ చేస్తారని అన్నారు. అయితే, ఇప్పుడు మరో టైటిల్‌ను యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ సినిమా టీజర్‌ను మే 31న రీ రిలీజ్ అవుతున్న 'మోసగాళ్లకు మోసగాడు' మూవీతో పాటు థియేటర్లలోనే ముందుగా రిలీజ్ చేస్తారని ఓ న్యూస్ లీకైంది.

ఇక, మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











