SSMB28: ఫ్యాన్స్‌కు మహేశ్ షాక్.. సగానికి సగం తగ్గించేశాడా? టైటిల్ మాత్రం అదే ఫిక్స్!
ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతూ.. టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. గత ఏడాది వచ్చిన 'సర్కారు వారి పాట'తో నిరాశనే ఎదుర్కొన్నాడు.
దీంతో ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం మహేశ్ బాబు ఇప్పుడు తన 28వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో మీరే చూడండి!

త్రివిక్రమ్‌తో మహేశ్ మూవీ: మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కుతోంది. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

షూటింగ్ మాత్రం లేటుగా: మహేశ్ బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే మొదలు అయింది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఆ తర్వాత మహేశ్ ఇంట్లో వరుస విషాదాలు, అతడు కరోనా బారిన పడడం సహా కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో షూట్ లేటైంది.

మూవీ టైటిళ్లపై సస్పెన్స్: మహేశ్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమ్మ కోసం', 'అయోధ్యలో అర్జునుడు', 'అమ్మకోసం', 'గుంటూరు కారం', 'అమరావతికి అటు ఇటు' వంటి టైటిళ్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై మాత్రం డైలమా కొనసాగుతూనే ఉంది.

కృష్ణ బర్త్‌డే.. సూపర్ ట్రీట్: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమా నుంచి టైటిల్ వీడియో రాబోతుంది. దీన్ని సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే 31వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఇందుకోసం ఓ పవర్‌ఫుల పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.
టైటిల్ మాత్రం అదే ఫిక్స్: సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ గురించి వచ్చినన్ని వార్తలు.. ఈ మధ్య కాలంలో దేని విషయంలోనూ రాలేదు. అంతలా ఈ మూవీ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో దీనికి 'గుంటూరు కారం' అనే టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు తాజాగా తెలిసింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్.

ఫ్యాన్స్‌కు మహేశ్ బిగ్ షాక్: మహేశ్ బాబు మూవీ గ్లింప్స్‌పై హైప్ బాగా పెరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపించిన గ్లింప్స్ వీడియోపై మహేశ్ బాబు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో నిమిషం పైగానే ఉన్న ఈ వీడియోను.. 30 సెకెన్లకు కుదించాలని గురూజీకి సూచించాడట. దీంతో చేసేదేం లేక చిన్న వీడియోను మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











