For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ బాబు అన్నగా స్టార్ హీరో: ఇద్దరినీ ఒకేసారి సెటిల్ చేయబోతున్న స్టార్ డైరెక్టర్!

  By Manoj Kumar P
  |

  కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త పోకడలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని రీతిలో హీరోలు వేరే స్టార్ల సినిమా కోసం సాయం చేయడం నుంచి మొదలు పెట్టి, ముఖ్యమైన రోజులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం వరకు రోజుకో న్యూస్ అయినా బయటకు వస్తోంది. దీంతో హీరోలతో పాటు వాళ్ల అభిమానుల మధ్య కూడా స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తోంది. దీనికి అనుగుణంగానే టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే త్వరలో మరో మూవీ రాబోతుంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

  వాటి ఫలితాలే ఇండస్ట్రీని మార్చేశాయి

  వాటి ఫలితాలే ఇండస్ట్రీని మార్చేశాయి

  తెలుగులో మొదటి తరం హీరోలు ఉన్న కాలంలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇవి కనిపించలేదు. కానీ, ఈ మధ్య కాలంలో ఆ తరహా సినిమాలు పదుల సంఖ్యలో వస్తున్నాయి. దీనికి కారణం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ‘గోపాల.. గోపాల', ‘మనం', ‘F2', ‘వెంకీ మామ' సహా కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే.

  భారీ సాహసాలు చేస్తున్న బడా స్టార్స్

  భారీ సాహసాలు చేస్తున్న బడా స్టార్స్

  మల్టీస్టారర్ మూవీలు చూడడానికి ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు. అదే సమయంలో హీరోలు కూడా తమ ఇగోలను పక్కన పెట్టేసి సై అంటున్నారు. దీంతో దర్శక నిర్మాతలు ధైర్యం చేసి కొన్ని సినిమాలను పట్టాలెక్కించేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి బడా హీరోలు RRR మూవీ చేస్తున్నారు. వీళ్లే కాదు మరికొందరు స్టార్స్ కూడా మల్టీస్టారర్లకు ఓకే చెబుతున్నారు.

  మహేశ్ బాబుతో త్రివిక్రమ్ మరో మూవీ

  మహేశ్ బాబుతో త్రివిక్రమ్ మరో మూవీ

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘భరత్ అనే నేను', ‘మహర్షి', ‘సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం ఆయన పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండింటి మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది.

  భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న సినిమా

  భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న సినిమా

  గతంలో త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో ‘అతడు', ‘ఖలేజా' వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో మొదటిది హిట్ అవగా, రెండోది నిరాశ పరిచింది. దీంతో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు ఈ ఇద్దరు. అందుకోసమే మాటల మాంత్రికుడు ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేశాడట. అది మల్టీస్టారర్ మూవీగా రూపొందబోతుందని తాజా సమాచారం.

   మహేశ్ సినిమాలో మరో సీనియర్ హీరో.!

  మహేశ్ సినిమాలో మరో సీనియర్ హీరో.!

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ బాబుతో పాటు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నాడట. గతంలో వీళ్లిద్దరూ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మూవీ చేసిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ హీరోలను ఏకం చేయబోతున్నాడట త్రివిక్రమ్. 2021 చివర్లో ఇది పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

  MAA Passes New Rule, Actors Remuneration To Be Reduced By 20 Percent | Filmibeat Telugu
   ముగ్గురు మూడు సినిమాలతో బిజీగా

  ముగ్గురు మూడు సినిమాలతో బిజీగా

  వాస్తవానికి త్రివిక్రమ్... మహేశ్ బాబుతో ఎప్పుడో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎందుకో కొంత గ్యాప్ వచ్చింది. అలాగే, వెంకటేష్‌తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు. ఇది కూడా పట్టాలెక్కలేదు. దీంతో ఇద్దరి ప్రామిస్‌లను ఏక కాలంలో పూర్తి చేయాలని భావించిన మాటల మాంత్రికుడు.. అందుకు అనుగుణంగానే మల్టీస్టారర్ కథ రాసినట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Mahesh Babu is continuing as the Superstar of Telugu Cinema irrespective of hits and flops. He is also the Star who is endorsing maximum number of brands. Mahesh Babu ventured into business with AMB Cinemas. Mahesh, Vijay Devarakonda was roped to play the male lead.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X