పూరీ టీమ్ పై మహేష్ బాబు సీరియస్
మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ చిత్రం పైరసీ ప్రోమో విడుదల కావటంతో ఆయన చాలా ఫీలవుతున్నారు. ఆయన ఈ విషయం తెలిసిన వెంటనే పూరీ జగన్ కి ఫోన్ చేసి చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. తాము అఫీషియల్ గా విడుదల చేద్దామనుకున్న ప్రోమో రెండురోజుల ముందే లో క్వాలిటితో విడుదల కావటం ఆయన్ని చాలా బాధించింది. ఫ్యాన్స్ అంతా కూడా ఆ ప్రోమో చూసి షాక్ అయ్యి, ఆశ్చర్యంతో వెంటనే ఆయనకు ఫోనే చేయటం జరిగింది. దాంతో ఇమ్మిడియట్ గా తమన్ అది ఫేక్ ప్రోమో అంటూ సంజీయిషీ ఇచ్చుకుంటూ ట్విట్ చెయ్యాల్సి వచ్చింది. ఇక మహేష్ బాబు ఇలా జరగటానికి కారణం కేవలం బిజినెస్ మ్యాన్ చిత్రానికి చెందిన టీమ్ భాధ్యతలేని తనమనే భావించి సీరియస్ అయ్యారని చెప్పుకుంటున్నారు. టెక్నికల్ టీమ్ వారి కేరెలెస్ బిహేవియర్ ఈ ఫేక్ టీజర్ బయిటకు కారణం అని తెలుస్తోంది.
ప్రస్తుతం తమ చిత్రంలోని ఆ డైలాగుని బయిటకు పంపిన ఆ వ్యక్తి ఎవరా అనే దానిపై పూరీ ఎంక్వైరీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఈ రోజు ఒరిజనల్ టీజర్ ని విడుదల చేస్తారు. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై పూరి జగన్నాధ్ ఈ రూపొందిస్తున్న చిత్రం సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











