రాజమౌళి రాగానే.. అనిల్ రావిపూడి సినిమా క్యాన్సిల్?

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకులల్లో అనిల్ రావిపూడి ఒకరు. హీరోలకు కమర్షియల్ సక్సెస్ అందించడంలో ఈ యువ దర్శకుడు కథను చాలా తెలివిగా రాసుకుంటాడు. హీరోల క్రేజ్ కి తగ్గట్టుగా సినిమాలను డిజైన్ చేయగల అనిల్ రావిపూడితో సినిమా అంటే ఎలాంటి హీరోలైనా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు.

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2 సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్న అనిల్ ఈ సంక్రాంతికి మహేష్ బాబుతో సరిలేరు నికెవ్వరు అంటూ మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. దీంతో మహేష్ అనిల్ తో మరో సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాడు. ఒక సినిమా వేరే వాళ్ళతో చేసి నెక్స్ట్ ఇయర్ అనిల్ సినిమాను లైన్ లో పెట్టాలని అనుకున్నాడు. కానీ ఇంతలో రాజమౌళి రావడంతో మహేష్ అనిల్ ప్రాజెక్టును సైలెంట్ గా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

Mahesh babu anil ravipudi upcoming project canceled

ఇది వరకే మహర్షి సినిమా అనంతరం ఆ చిత్ర దర్శకుడితో మరో సినిమా చేస్తానని చెప్పిన మహేష్ ఎందుకో క్యాన్సిల్ చేసుకొని గీతగోవిందం దర్శకుడిని లైన్ లో పెట్టాడు. ఇక ప్రస్తుతం రాజమౌళితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న మహేష్ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పై చర్చలు జరుపుతున్నారు.

RRR అయిపోగానే మహేష్ పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తేవాలని రాజమౌళి అనుకుంటున్నారు. దీంతో మహేష్ పరశురామ్ ప్రాజెక్ట్ అయిపోగానే పూర్తిగా రాజమౌళి కోసం సమయాన్ని కేటాయించాలని ఫిక్స్ అయ్యారట. అందుకే ముందు అనుకున్న అనిల్ రావిపూడి డీల్ ని ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X