మరోసారి కామెడి దర్శకుడితోనే మహేష్ సినిమా.. రాజమౌళి కంటే ముందే.. ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఒక రేంజ్ లో హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాడాని అందరికి తెలిసిందే. ఇక సక్సెల్ ఫుల్ దర్శకులతో వర్క్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే మహేష్ పాన్ ఇండియా సినిమా కంటే ముందే మరో కామెడీ దర్శకుడిని లైన్ లో పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ లేకపోయి ఉంటే
ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమా చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా కోసం మహేష్ ఫీట్నెస్ లో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలయ్యేది. కానీ కరోనా వైరస్ తీవ్రత తగ్గిన అనంతరం షూటింగ్ స్టార్ట్ చేయాలని కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.

RRR రిలీజ్ అయ్యే వరకు..
అసలు మ్యాటర్ లోకి వస్తే మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళితో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు మొదలు కానుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. RRR అయిపోయే వరకు జక్కన్న మరో సినిమాని ఎనౌన్స్ చేయకూడదని అనుకుంటున్నాడు.

అందుకే ఈ గ్యాప్ లో..
అయితే RRR షూటింగ్ మొదలైన తరువాత రిలీజ్ చేయడానికి రాజమౌళికి కనీసం ఎడాది సమయమైనా పడుతుంది. అంటే అప్పటిలోపు మహేష్ సర్కారు వారి పాటను పూర్తి చేయవచ్చు. ఇక రాజమౌళికి RRR తరువాత మహేష్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ ప్లాన్ రెడీ చేసుకోవడానికి మళ్ళీ కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ గ్యాప్ లో మరో మినీ సినిమాను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడట.
Recommended Video

అనిల్ రావిపూడితో
మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రాజమౌళి కంటే ముందే అనిల్ తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక సర్కారు వారి పాట సినిమాను సెప్టెంబర్ లో మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











