దిల్ రాజును... మహేష్ బాబు అందులో ఇరికించాలని చూశాడా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నెం.1 హీరోగా ఇండస్ట్రీలో హవాకొనసాగిస్తున్న స్టార్. వరుస విజయాలతో బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్న ఇలాంటి హీరోతో సినిమా చేయాలని టాప్ ప్రొడ్యూసర్లు పోటీపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
అయితే అందరు నిర్మాతల కోరిక తీర్చడం కూడా కొంతకష్టమైన విషయమే. ఎందుకంటే మహేష్ బాబు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాల కంటే ఎక్కువ చేయడానికి ఇష్టపడరు. అందుకే తాను చేసే ఒకటీ రెండు ప్రాజెక్టుల్లోనే తనతో సినిమా చేయాలని ఆశ పడుతున్న నిర్మాతలకు భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

‘మహర్షి’లో ముగ్గురి భాగస్వామ్యం
చాలా రోజుల క్రితం మహేష్ బాబు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, పివిపి సంస్థకు సినిమా చేస్తానని మాటిచ్చారు. దీంతో పాటు దిల్ రాజుకు కమిట్మెంట్ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నారట. ఈ ముగ్గురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ‘మహర్షి' మూవీలో వారిని భాగస్వామ్యం చేశారని టాక్.

దిల్ రాజుతో మరో ప్రాజెక్ట్
‘మహర్షి' సినిమా తర్వాత మరో సినిమా చేస్తానని కూడా దిల్ రాజుకు మహేష్బ బాబు మాట ఇచ్చిన్లట్లు సమాచారం. దీంతో మహేష్ బాబుతో సోలోగా భారీ మూవీ చేయాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇంతలోనే మహేష్ బాబు ఈ నైజాం నిర్మాత వద్దకు మరొక ప్రతిపాదన తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో ఇరికించాలని చూశారు కానీ..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో మహేష్ బాబు త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ‘మహర్షి' తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని టాక్. అయితే దిల్ రాజుకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చిన మహేష్ బాబు అతడిని ఇందులో ఇరికించాలని చూశారట.

దిల్ రాజు మామూలోడు కాదుగా..
అయితే మహేష్ బాబుతో సోలోగా బిగ్ మూవీ చేయాలని ప్లాన్ చేసుకున్న దిల్ రాజు... అనిల్ సుంకర తీస్తున్న సినిమాలో భాగస్వామ్యం కావడానికి ఇష్టపడలేదని టాక్. తాను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది మీతో సపరేట్ సినిమా చేస్తానని సున్నితంగా తప్పుకున్నారట.


Click it and Unblock the Notifications











