ప్లాప్ ఇచ్చిన సీనియర్ దర్శకుడితో మహేష్ మరో బిగ్ బడ్జెట్ మూవీ..?
సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా ఒక సినిమా ప్లాప్ అయితే ఎంతగా బాధపడతాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తన నిర్ణయం వల్ల నష్టపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అందుకే ప్లాప్ దర్శకులను పెద్దగా పట్టించుకోడని అందరికి తెలిసిన విషయమే. ఇక తనకు డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో మహేష్ ఇంతవరకు రెండవసారి వర్క్ చేయలేదు.
అయితే ఈ సారి ఒక బడా దర్శకుడు మహేష్ తో మరో సినిమా చేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. స్పైడర్ సినిమాతో మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందించిన ఏఆర్.మురగదాస్. ఆ దర్శకుడంటే మహేష్ కి ఎంత ఇష్టమో ఆ సినిమా ప్రమోషన్స్ లోనే అర్ధమయ్యింది. కానీ విడుదల తరువాత సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయకూడదని మహేష్ ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు.

ఇక ఇటీవల మురగదాస్ మహేష్ కోసం కూడా మరో కథను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ తో సినిమా చేసిన తరువాత తప్పకుండా మనం వర్క్ చేద్దామని మహేష్ తో ఇటీవల వీడియో కాల్ లో మాట్లాడినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఒక కమర్షియల్ మూవీని తొందరగా ఫినిష్ చేసి రాజమౌళి సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు. ఇక మురగదాస్ ప్రాజెక్టును ఒకవేళ ఒప్పుకుంటే ఎప్పుడు మొదలుపెడతాడు అనేది హాట్ టాపిక్ గా మారుతోంది.


Click it and Unblock the Notifications











