సుకుమార్ దర్శకత్వంలో లెక్చరర్‌గా ప్రిన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ది బిజినెస్‌మ్యాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సనిమా తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తూంది. ఇందులో మహేష్ లెక్చరర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పుల్ ఫ్లెజ్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తూంది. ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
మహేష్ బాబు ఇదివరకెన్నడూ కనిపించని విధంగా కొత్తలుక్ తో లెక్చరర్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా విడుదలై భారీ విజయం సాధించిన దూకుడు సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపిచంద్ ఆంచటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2012 జనవరి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











