మిడిల్ క్లాస్ టీచర్ కొడుగ్గా మహేష్...
మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం ఖలేజాలో మహేష్ బాబు..నిబద్ధతత, క్రమశిక్షణ కలిగిన ఓ మిడిల్ క్లాస్ టీచర్ కుమారుడుగా...సాధారణ టాక్సీడ్రైవర్ పాత్రను పోషించాడు. సీతారామరాజు అనే పేరు గల మహేష్..ఇతరుల విషయంలో కలగజేసుకోకుండా తన పని తాను చేసుకునిపోతుంటాడు. అయితే కొన్ని కారణాలవల్ల అతను రాజస్థాన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సుభాషిణి(అనుష్క) పరిచయమవుతుంది. అయితే అది ఓ ఎటాక్ కి దారితీస్తుంది. అక్కడ నుంచి వారిద్దరూ ఎస్కేప్ అవుతారు. అయితే ఆ ఫైట్ లో తీవ్ర గాయాలు అయి..స్పృహ తప్పుతాడు. కొద్ది గంటల తర్వాత అతను లేచి చూసేసరికి ఓ గ్రామంలో ఉంటాడు. అక్కడ గ్రామస్తులు అతనికి స్పృహ తెప్పించి సపర్యలు చేస్తూంటారు. అంతేగాక వారు అతన్ని దేముడు పంపిన దూతగా భావిస్తూంటారు. వారి కోరికపై అక్కడే ఉండి తన ఖలేజా చూపుతూ అక్కడ జనాల్ని ఇబ్బంది పెడుతున్న లోకల్ పొలిటీషన్ (ప్రకాష్ రాజ్) ని ఎదుర్కొని ఆ ఊరిని కాపాడతాడు. దాదాపు నలభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా హాస్యం కలగలిపి త్రివిక్రమ్ రూపొందించారని తెలుస్తోంది. అలాగే అక్టోబర్ 7న రిలీజవుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











