క్రేజీ మహేష్ బాబు ఇక 'సీతారామరాజు'
కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం అప్పట్లో పెద్ద హిట్. అలాంటి హిట్ కొట్టాలనేమో...మహేష్ బాబు..తన తాజా చిత్రం ఖలేజా లో సీతారామరాజు అనే పాత్రను చేస్తున్నారు. మొదట మహేష్ చేసే ఈ టాక్సీ డ్రైవర్ పాత్రకు వేరే పేరు పెట్టినా ...మహేష్ సూచనతో ఈ పేరు మార్చారని తెలుస్తోంది. ఇక అతని వెనక పడే అనూష్క పాత్ర పేరు సుభాషిణి. ఆమెను ఇంట్లో వాళ్ళు బంగారం అని పిలుస్తూంటారు. అయితే ఆమె తారసపడ్డప్పుడల్లా మేలుకంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. దీంతో అనుష్కని ముద్దుగా ఐరన్‌లెగ్ అని పిలుస్తాడు. దాదాపు నలభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా హాస్యం కలగలిపి త్రివిక్రమ్ రూపొందించారని తెలుస్తోంది. అలాగే అక్టోబర్ 7 న రిలీజవుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ పాటలు అనీఫిషయల్ గా నెట్లో రావటంతో ...మహేష్ కూడా అదే రూటులో పాటలను విడుదల చేస్తూ ఆ వివరాలను ట్విట్టర్ లో ఉంచుతున్నారు. ఇక చిత్రంలో మహేష్-బ్రహ్మానందం-సునీల్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్, మరెన్నో సరదా సన్నివేశాలు ఈ చిత్రంలో హైలెట్స్‌గా నిలుస్తాయంటున్నారు. 'దైవమ్ మానుష్య రూపేణా" అనే థీమ్‌తో ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించాడు. ఇక ఈ సీతారామరాజు క్యారెక్టర్ మాస్ జనాలకి బాగా పడుతుందని...అదే పేరుతో పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని యూనిట్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











