మహేష్‌ను ‘తుంటరి’లా మారుస్తున్న సుకుమార్?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈచిత్రానికి 'తుంటరి' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తాజా ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఈచిత్రానికి 'ఆచార్య' అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వినిపించగా నిర్మాతలు ఖండించారు.

ఈచిత్రం షూటింగ్ గోవా ఇటీవలే పూర్తయింది. మహేష్ బాబు సరసన క్రితి సానన్ హీరోయిన్. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.
మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలతో పాటు, సుకుమార్ సినిమాలోని ప్రత్యేక అంశాలను కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా మహేష్ బాబు గత చిత్రకంటే భిన్నమైన లుక్ తో ఈచిత్రంలో కనిపించనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోలందరిలో అందగాడిగా పేరున్న మహేష్ ఈచిత్రంలో తన న్యూ లుక్‌తో ప్రేక్షకుల మతి పోగొట్టనున్నాడు.
ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే...ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లు, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications











