మహేష్ బాబు నుంచి దిల్ రాజుకు ఊహించని ఝలక్?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. దిల్ రాజు అనుకున్నది ఒకటి... అయింది ఒకటి, మహేష్ బాబు నుంచి ఆయనకు ఊహించని ఝలక్ తగిలిందనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రాన్ని దిల్ రాజు తన బేనర్లో సోలోగా చేద్దామనుకున్నారు. కానీ మహేష్ బాబు గతంలో ఇచ్చిన మాట మేరకు అశ్వినీదత్‌ను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేశాడట. మహేష్ బాబు మాట కాదనలేక దిల్ రాజు కూడా ఓకే చెప్పక తప్పలేదట. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టులో పిపివి మరో నిర్మాతగా ఎంటరవ్వడంతో అసంతృప్తి మరింత పెరిగిందట.

దిల్ రాజు ఆశించింది ఒకటి.. జరిగింది మరొకటి

దిల్ రాజు ఆశించింది ఒకటి.. జరిగింది మరొకటి

‘మహర్షి' తర్వాత మహేష్ బాబు తన కోసం సపరేటుగా సినిమా చేస్తారని దిల్ రాజు ఆశించారు. కానీ సూపర్ స్టార్ మనసులో ఆ ఆలోచన లేదని తాజాగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

అనిల్ సుంకరతో చేతులు కలపాలని చెప్పారా?

అనిల్ సుంకరతో చేతులు కలపాలని చెప్పారా?

‘మహర్షి' తర్వాత సుకుమార్‌తో సినిమా మొదలవ్వాల్సి ఉన్నా... ఇంకా స్క్రిప్టు సిద్దం కాకపోవడంతో అనిల్ రావిపూడితో చేయడానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి నిర్మించాలని దిల్ రాజుకు సూచించారట. అనిల్ రావిపూడి స్టామినా తెలుసు కాబట్టి దిల్ రాజు కాదనలేక పోయారట.

మహేష్ బాబు ఆలోచన అదే

మహేష్ బాబు ఆలోచన అదే

అనిల్ రావిపూడి సినిమా ద్వారా అటు అనిల్ సుంకరకు ఇచ్చిన కమిట్మెంటును, దిల్ రాజుకు ఇంకో మూవీ చేస్తాననే మాటను నిలబెట్టుకోవాలనే ఆలోచనతోనే సూపర్ స్టార్ ఇలా డిసైడ్ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

దిల్ రాజు ఆశ నెరవేరేనా?

దిల్ రాజు ఆశ నెరవేరేనా?

పరిస్థితి చూస్తుంటే తన సినిమాలను ఎవరు నిర్మించాలనేది మహేష్ బాబు స్వయంగా డిసైడ్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుంటున్నారు. మరి సోలోగా మహేష్ బాబుతో సినిమా చేయాలనే దిల్ రాజు కోరిక ఎప్పుడు తీరేనో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X