పోలీస్ పాత్రలో మరోసారి మహేష్ ఇరగతీస్తాడట
14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. గత కొంతకాలంగా సరైన సినిమాల్లేని తమన్నాకి ఇది బంగారం లాంటి అవకాశమే అంటున్నారు. అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని,కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకువచ్చిందని సమాచారం. ఈనెల 25న చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభిస్తారు. నవంబరులో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. వినోదం, యాక్షన్ కలగలిపిన చిత్రమిది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు.
ఇప్పటికే ఓసారి మహేష్ బాబుతో సుకుమార్ సినిమాలో చేసే అవకాశం రాగా...డేట్స్ ప్రాబ్లం వల్ల చేజార్చుకున్న తమన్నా ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరుగకుండా డేట్స్ విషయలో జాగ్రత్త పడుతోంది. దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....'ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకునే పనిలో ఉన్నాడట శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న '1' (నేనొక్కడినే)లో నటిస్తున్నారు మహేష్. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.


Click it and Unblock the Notifications












