మళ్లీ తండ్రి కాబోతున్న మహేష్, ఆగస్టులో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ తండ్రి కాబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. మహేష్ సతీమణి నమ్రత ఆగస్టులో ప్రసవించనుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే గౌతంకు జన్మనిచ్చిన ఈ జంట ఈ సారి ఆడ పిల్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తలు అఫీషియల్‌గా ధృవీకరించబడాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా మహేష్ బాబు యాక్టివిటీస్ చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే బయట పెడితే మీడియా వాళ్లు అనవసర హంగామా మొదలు పెట్టి రచ్చ చేస్తారనే కారణంగానే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారట.
ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగాల్సి ఉంది. అయితే అక్కడికి వెళ్లడం ఇష్టం లేని మహేష్ బాబు దిల్ రాజుపై ఫోర్స్ చేసి అందుకు సంబంధించిన సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించారని అంటున్నారు. గర్భతిగా ఉన్న భార్యకు తగ్గరగా ఉండాలనే కారణంతోనే మహేష్ బాబు ఈనిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా...మహేష్ బాబు మరోసారి తండ్రి కావడం అనే వార్త వినగానే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు మంచి శుభవార్తే అని, అయితే మహేష్ బాబు అఫీషియల్ గా ప్రకటించిన తర్వాతే సందడి మొదలు పెడతామని, అప్పటి వరకు కామ్ గానే ఉంటామని అంటున్నారు ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











