Super Star Krishna: తండ్రి పేరు నిలిచిపోయేలా మహేష్ కీలక నిర్ణయం.. భారీ ఖర్చుతో ప్లాన్

హాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందిన వార్త ఇండస్ట్రీలో అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో దిగ్భ్రాంతికి లోనయ్యారు. సూపర్ స్టార్ కృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ఆయన అంతిమయాత్ర ద్వారా మరోసారి అర్థమయింది. అయితే ఇప్పుడు తండ్రి పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా మహేష్ బాబు మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం భారీగా ఖర్చు కూడా చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఆ వివరాలలోకి వెళితే..

తండ్రికి తగ్గ వారసుడిగా..

తండ్రికి తగ్గ వారసుడిగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు అడుగు పెట్టిన విధానం ఆయన అభిమానులకు ఎంతగానో నచ్చింది. మహేష్ కూడా ఎవరిని నొప్పించకుండా చాలా మంచి హీరోగా గుర్తింపును అందుకున్నాడు. అంతేకాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా తండ్రి బాటలోనే కొనసాగాడు.

 భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

ఇక కృష్ణ మృతి పట్ల తెలుగు ప్రజలు కూడా ఎంతగానో దిగ్భ్రాంతికి లోనయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కేవలం ఒక వెండి తెరపై నటుడిగా మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా ఎంతో దగ్గరయ్యారు. ఎప్పుడు అభిమానులు వచ్చినా కూడా వారితో ప్రత్యేకంగా మాట్లాడడం చేస్తుండేవారు. ఇక అదే ఫ్యాన్ ఫాలోయింగ్ మహేష్ బాబుకు కూడా కంటిన్యూ అయింది. ఒక విధంగా అది మహేష్ బాబు చేసుకున్న గొప్ప అదృష్టం అని కూడా చెప్పవచ్చు.

ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ టెక్నాలజీ

ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ టెక్నాలజీ

ఇక సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అంతే కాకుండా సరికొత్త టెక్నాలజీని కూడా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశపెట్టి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఒక విధంగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవా కార్యక్రమాలు ఎవరు కూడా ఎవరు మర్చిపోలేరు. నిర్మాతలకు కూడా ఆయన ఎంతో అండగా ఉండేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి అందరూ ఎన్నో విషయాలను కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు.

మరొక అడుగు ముందుకు వేసి

మరొక అడుగు ముందుకు వేసి

అయితే సూపర్ స్టార్ కృష్ణ బ్రాండ్ మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు అని చెప్పవచ్చు. ఇండస్ట్రీ బ్రతికున్నంత కాలం ఆయన పేరు అలానే స్మరిస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు మరొక అడుగు ముందుకు వేసి సూపర్ స్టార్ కృష్ణ పేరుమీద హైదరాబాద్ లో ఒక మెమెరీయల్ బిల్డింగ్ నిర్మించడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మ్యూజియం తరహాలో..

మ్యూజియం తరహాలో..

ఇప్పటివరకు సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇక వాటన్నిటినీ కూడా బిల్డింగ్ లో ప్రత్యేకంగా అందరూ చూసే విధంగా మ్యూజియం తరహాలో ఏర్పాటు చేయబోతున్నారట. అంతేకాకుండా ఆయనకు ఇష్టమైన వస్తువులు మరెన్నో సినిమా పోస్టర్లు పర్సనల్ ఫ్యామిలీ ఫోటోలు ఇలా ఎన్నో కృష్ణ గారి జ్ఞాపకాలను అందులో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అందుకోసం మహేష్ బాబు భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి కూడా డిసైడ్ అయ్యారట. ఇక త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X